12-08-2025 01:40:51 AM
- వారి కోసం ప్రత్యేకంగా ఒక కాలమ్ కేటాయించాలి..
- కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ లక్ష్మణ్ విజ్ఞప్తి
హైదరాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం నిర్వహించే జన గణనలో ఈసారి దేశంలో అట్టడుగు వర్గాలైన డీఎన్టీ (డీ నోటిఫైడ్), ఎన్టీ (సంచార), ఎస్‌ఎన్టీ (అర్ధ సంచార) జాతులను లెక్కించాలని, దేశంలో వీరి జనాభా సుమారు 25 కోట్లు ఉంటుందని, అయినప్పటికీ.. వీరు ఇప్పటివరకు జ నాభా లెక్కల్లోకి రాలేదని రాజ్యసభ సభ్యు డు డాక్టర్‌లక్ష్మణ్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆయన రాజ్యసభ వేదికగా ప్రసంగిస్తూ.. జనాభా లెక్కల్లో ఆయా వ ర్గాలకు ప్ర త్యేకంగా ఒక కాలమ్ కేటాయించాలని కోరారు.
జనగణనతోనే ఆ యా వర్గాలNomadic tribes should be counted in the censusకు న్యా యం జరుగుతుందని అభిప్రాయప డ్డారు. చారిత్రకం గా, సామాజికంగా వారెంతో అన్యాయానికి గురయ్యారని, బ్రిటీష్ పాలకులు నాడు వారికి ‘క్రిమినల్ ట్రైబ్స్’గా ముద్ర వేశారని గుర్తుచేశారు. 1952లో ‘క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్’ రద్దయినప్పటికీ, ఈ వర్గాలు ఇప్పటివరకు రిజర్వేషన్లు పొందలేకపోయారని వా పోయారు. కనీసం వారికి విద్య, వైద్యం కూ డా అందడం లేదన్నారు. సమస్యపై జస్టిస్ దాదా ఇదాటే కమిషన్ చేసిన సిఫార్సులను పరిగణనలోకి తీసుకొని, డీఎన్టీ (డీనోటిఫైడ్), ఎన్టీ (సంచార), ఎస్‌ఎన్టీ (అర్ధ సంచార) జాతుల అభ్యున్నతి కోసం ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.