12-08-2025 01:39:12 AM
-రాజ్యసభలో మరోసారి బీఆర్‌ఎస్ వాయిదా తీర్మానం
హైదరాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి): ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్ట్‌పై బీఆర్‌ఎస్ ఎంపీలు మరోసారి రాజ్యసభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. అనుమతులు లేకుండా నిర్మిస్తున్న బనకచర్లను అడ్డుకోవాలని తీర్మానంలో పేర్కొ న్నారు. రాజ్యసభలో ఈ తీర్మానాన్ని బీఆర్‌ఎస్ పార్టీ తరఫున ఆ పార్టీ పార్లమెంటరీ నేత కేఆర్ సురేశ్‌రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ ప్రాజెక్ట్ వల్ల ఎగువన ఉన్న తెలంగాణకు తీవ్రంగా నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు.
ఏపీ ప్రభుత్వం అనధికారికంగా ఉపయోగిస్తున్న గోదావరీ నదీజలాల అంశాన్ని కూడా ప్రస్తావించారు. తెలంగాణ ప్రయోజనాలను రేవంత్‌రెడ్డి ఏపీ సీఎం వద్ద తాకట్టు పెట్టారని బీఆర్‌ఎస్ ఎంపీలు మండిపడ్డారు. సభా కార్యకలాపాలను వాయిదా వేసి.. బనకచర్లపై చర్చించాలని బీఆర్‌ఎస్ ఎంపీలు కోరారు. కాగా ఈ నెల 6న సైతం బీఆర్‌ఎస్ నేతలు బనకచర్లపై వాయిదా తీర్మానం ఇచ్చారు. అప్పుడు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్‌సింగ్ తోసిపుచ్చి, చర్చకు నిరాకరించారు.