12-08-2025 01:42:59 AM
హైదరాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీలు తమ ర్యాంకింగ్‌ను మెరుగుపర్చుకోవాలని, మం చి ఫలితాలు, పరిశోధనలతోనే ఇది సాధ్యమవతోందని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి పేర్కొన్నారు. సోమవా రం ములుగులోని కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యానవన విశ్వవిద్యాలయంలో విద్యామండలి ఆధ్వర్యంలో నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (ఎన్‌ఐఆర్‌ఎఫ్) వర్క్‌షాప్‌ను నిర్వహించారు. దీనికి రాష్ట్రంలోని పన్నెండు వర్సిటీల వీసీలు, డీన్‌లు, డైరెక్టర్లు, విద్యామండలి వైస్ చైర్మన్లు, కార్యదర్శి పాల్గొన్నారు. జాతీయ, అంతర్జాతీ సంస్థల నుంచి నిధులను ఆకర్షించడంలో ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్ కీలకంగా వ్యవహరిస్తోందన్నారు.