calender_icon.png 31 December, 2025 | 6:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమరవీరుల కుటుంబాలకు నామినేటెడ్ పోస్ట్‌లు ఇవ్వాలి

31-12-2025 12:00:00 AM

ఇజ్జగిరి సమ్మయ్య డిమాండ్ 

కాటారం, డిసెంబర్ 30, (విజయక్రాంతి) : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభు త్వం ఇచ్చిన హామీలలో భాగంగా అమరవీరుల కుటుంబాలలో నామినేటెడ్ పోస్టులను ఇవ్వాలని జాతీయ బీసీ సంఘం జయశంక ర్ భూపాలపల్లి జిల్లా ఇన్చార్జి ఇజ్జగిరి స మ్మయ్య డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ఏర్పడిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ఉద్య మ సమయంలో ప్రాణాలు అర్పించిన కు టుంబాలలో, ఉద్యమానికి ఊపిరి పోసిన వ్యక్తుల అభిప్రాయాల మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులలో నియమించాలని ఇజ్జగిరి సమ్మయ్య డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమరవీరులకు ఇచ్చే గౌరవాన్ని, తెలంగాణ ఉద్య మాన్ని గుర్తించి, ఈ కార్యక్రమాలను చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.