calender_icon.png 6 December, 2025 | 1:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోదాడ కర్ల రాజేష్ మృతికి పూర్తి బాధ్యత పోలీసులదే

06-12-2025 12:12:29 AM

ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ

ఖైరతాబాద్,(విజయక్రాంతి): కోదాడ కర్ల రాజేష్ పై విచారణ పేరుతో పోలీసులు థర్డ్ డిగ్రీ చేయడం వలనే మరణించాడని అతని మృతి కి పూర్తి బాధ్యత పోలీసు లే వహించాలని ఎం ఆర్ పి ఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఓ దళిత యువకున్ని ఆకారణంగా కేసులో విచారణ పేరుతో పోలీసులు హత్య చేశారని ఆరోపించారు.

రాజేష్ పై 8వ తారీకు ఫిర్యాదు అందితే అదే రోజు కేసు నమోదు చేసి తొమ్మిదవ తారీకు ఎఫ్‌ఐఆర్ చేసి పదవ తేదీన కోర్టులో హాజరు పరచామని పోలీసులు చెబుతున్నారని ఇవన్నీ కట్టు కదలని ఆరోపించారు.దీనిపై హై కోర్టు సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలి, ఫ్లోరెన్స్ టీం తో రి పోస్టుమార్టం జరిపించాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు నరసింహ, వేణు కుమార్, శివకుమార్, రాజేంద్ర, లలిత, సుకన్య తదితరులు పాల్గొన్నారు.