calender_icon.png 6 December, 2025 | 1:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్నలిస్టు రాజేందర్ కుటుంబానికి అండగా ఉంటా..

06-12-2025 12:00:00 AM

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కసి రెడ్డి,రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి 

ఆమనగల్లు, డిసెంబర్ 5: తెలంగాణ ఉద్యమకారుడు, జర్నలిస్టు రాజేందర్ గుండెపోటు గురయ్యాకాల మరణం చెందడం చాలా బాధాకరమని.. చిన్న వయసులో తన ని కోల్పోయి భార్య పిల్లలు  అండని కోల్పోయారని బాధిత కుటుంబానికి తను అండగా ఉంటానని కలిసి రెడ్డి నారాయణరెడ్డి భరోసా ఇచ్చారు. శుక్రవారం తలకొండ పల్లి మండలం లోని గట్టుపల్లి గ్రామంలో మండలంలో జర్నలిస్టుగా పనిచేస్తున్న రాజేందర్ రుద్రారం తెల్లవారుజామున గుండెపోటు కు గురైఅయ్యాడు.

కుటుంబ సభ్యుల ఇదిగమనించి మెరుగైన చికిత్స నిమిత్తం కల్వకుర్తిలో దావఖాన కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి లు, వివిధ మండలాల సహచర జర్నలిస్టులు, వివిధ పార్టీల నేతలు ఆయన నివాసంకు చేరుకొని రాజేందర్ మృతదేవానికి నివాళులర్పించారు. 

ఎమ్మె ల్యే కసి రెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ రాజేందర్ కుటుంబానికి అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో రాజేందర్ చురుకైన పాత్ర పోషించరని, చిన్న వయసులో ఉండకూడదు మరణించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

జర్నలిస్ట్ కుటుంబాలకు ప్రభుత్వం ఉండగా నిలబడాలి...

రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మెట్రో ఈవినింగ్ దినపత్రిక రిపోర్టర్ తక్కె లపల్లి రాజేందర్ గుండెపోటుతో మృతి చెందడంతో  టి డబ్ల్యూ జేఎఫ్ నేతలు ఆయనకు నివాళులర్పించారు. రాజేందర్ మృతి చెందిన విషయం తెలుసుకున్న తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజెఎఫ్) రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య, కో కన్వీనర్ పులిపలుపుల ఆనందం, రంగారెడ్డి జిల్లా టిడబ్ల్యుజేఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు మిద్దెల సత్యనారాయణ తదితరులు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. 

ఈ సందర్భంగా రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య మాట్లాడుతూ, ఈ మధ్యకాలంలో అనారోగ్య సమస్యలతో అనేకమంది జర్నలిస్టులు పిట్టల్లా  రాలిపోతున్నారని, అయినా కూడా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని అన్నారు. జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల జర్నలిస్టులకు వైద్యం అందక చనిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రతి కార్పొరేట్ ప్రైవేటు ఆసుపత్రిలో జర్నలిస్టులకు హెల్త్ కార్డులు అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, రాజేందర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మామిడి సోమయ్య డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆమనగల్ బ్లాక్ అధ్యక్షులు దరువుల శంకర్ కార్యదర్శి తిరుపతి సబ్యులు సహాయ కార్యదర్శి తూర్పు శ్రీను తదితరులు పాల్గొన్నారు.