calender_icon.png 6 December, 2025 | 1:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తమిళనాడు సీఎంకు మంత్రి ఉత్తమ్ ఆహ్వానం

06-12-2025 12:23:52 AM

హైదరాబాద్, డిసెంబర్ 5 (విజయక్రాంతి) : హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8,9 తేదీల్లో తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్--2047 గ్లోబల్ సమ్మిట్‌కు జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానించారు. న్యూఢిల్లీలోని జమ్ముకశ్మీర్ హౌస్‌లో సీఎం ఒమర్ అబ్దుల్లాను మంత్రి కలిశారు. ఈ భేటీలో రాష్ర్ట ప్రభుత్వం ప్రత్యేకంగా ముద్రించిన గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రికను ఒమర్ అబ్దుల్లాకు అందజేశారు.

ఈ సందర్భంగా  ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. తెలంగాణ రైజింగ్  గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానించినందుకు తెలంగాణ సీఎం, మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. సమ్మిట్‌కు వారు ప్రత్యక్షంగా హాజరు కాలేకపోతున్నానని, గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. అదేవిధంగా హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చెందుతుందని విశ్వసిస్తున్నా అని అన్నారు. అలాగే గ్లోబల్ సమ్మిట్‌కు రావాలని తమిళనాడు సీఎం స్టాలిన్‌ను ఉత్తమ్ ఆహ్వానిం చారు. చెన్నైలో సీఎంను కలిసి ఆహ్వానపత్రాన్ని అందజేశారు.