06-12-2025 12:00:00 AM
హైదరాబాద్, డిసెంబర్ 5 (విజయక్రాంతి): శుక్రవారం స్థానిక బడ్జెట్ హోటల్ నందు చాంబర్ ఆఫ్ కామర్స్, కిరాణం శాఖ వారి ఆధ్వర్యంలో కిరాణం శాఖ వారి సమస్యలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశా రు. మున్సిపల్ మేయర్ పూనకొల్లు నీరజ, మున్సిపల్ అధికారులు, కార్పొరేటర్ కమర్తపు మురళి పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్యాకింగ్ కవర్స్ 120 మైక్రో గ్రేడ్ ప్యాకింగ్ కవర్స్ మాత్రమే వాడాలని, ఇప్పటివరకు ఉన్నటువంటి సరుకును త్వరగా ఖాళీ చేయవలసిందిగా సూచించారు.
ప్యాకింగ్ కవర్స్ పై వేసిన చలానాలను మున్సిపల్ కమిషనర్‌తో మాట్లాడి నివృతి చేస్తామని తెలిపారు. ట్రేడ్ లైసెన్స్ విధానంలో చాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫీస్, కిరాణం శాఖ సభ్యులు తెలియజేసిన సమస్యలపై మున్సిపల్ మేయర్ సానుకూలంగా స్పందించారు. అట్టి సమస్యలను మున్సిపల్ కమిషనర్‌తో మాట్లాడి పరి ష్కరిస్తామని హామీ ఇచ్చారు.
సమావేశంలో చాంబర్ ఆఫ్ కామర్స్ నూతన పాలకవర్గ అధ్యక్షుడు కురువెళ్ళ ప్రవీణ్ కుమార్, ప్రధా న కార్యదర్శి సోమ నరసింహారావు (జీవై నరేష్), ఉపాధ్యక్షులు బత్తిని నరసింహారావు, సెంట్రల్ ఈసీ సభ్యులు మాటేటి కిరణ్ కుమార్, రాయపూడి రవికుమార్, సుకాసి శేషగిరిరావు, పోట్ల రామనాథం, కిరాణం శాఖ అధ్యక్షులు కుంకిమళ్ళ విశ్వనాధం, కార్యదర్శి మంకాల మల్లేశ్వర్, జనరల్ కార్యవర్గ సభ్యులు అరవపల్లి నవీన్ కుమార్, కిరాణం జాగిరి మర్చంట్ అసోసియేషన్ కార్యదర్శి వజ్రపు చక్రపాణి పాల్గొన్నారు