calender_icon.png 13 December, 2025 | 7:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొండా సురేఖకు నాన్ బెయిలబుల్ వారెంట్.. అవాస్తవం

12-12-2025 12:41:54 AM

  1. మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన మంత్రి 
  2. ఫిబ్రవరి 5న విచారణకు హాజరుకావాలని మాత్రమే కోర్టు ఆదేశం

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 11 (విజయక్రాంతి): రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిందంటూ మీడియాలో, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను మంత్రి కార్యాలయ వర్గాలు ఖండించాయి. ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదని, అది పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశాయి. అసలేం జరిగింది..

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసు గురువారం నాంపల్లికోర్టులో విచారణకు వచ్చింది. మంత్రి గైర్హాజరు కావడంతో కోర్టు వారెంట్ జారీ చేసిందంటూ పలు ఛానళ్లు, వెబ్‌సైట్లలో వార్తలొచ్చాయి. దీనిపై మంత్రి వర్గాలు స్పందిస్తూ..  ఫిబ్రవరి 5న విచారణకు తప్పక హాజరుకావాలనే న్యాయ మూర్తి స్పష్టం చేశారని చెప్పాయి.