13-12-2025 06:52:22 PM
నిర్మల్,(విజయక్రాంతి): శ్రీ సరస్వతి శిశు మందిర్ బుధవార్ పేట్ పాఠశాలలో ఆచార్యుల నిరంతర ప్రశిక్షణ వర్గ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు ముప్పిడి రవి, పాఠశాల కార్యదర్శి ముదుల్కర్ శ్రీకాంత్, డాక్టర్ రజిని పాల్గొన్నారు. పాఠశాల కార్యదర్శి నుండి సన్మార్గంలో నడిపించేవాడు కష్టాలను తొలగించేవారు. నిరంతర విద్యార్థి అని ఎప్పటికప్పుడు కాలానుగుణంగా మారుతూ బోధించాల్సి ఉంటుందని తెలియజేశారు. డాక్టర్ రజిని జిల్లా కార్యకారిణి సభ్యులు మాట్లాడుతూ సరస్వతి శిశు మందిరాలలో విలువలతో కూడిన విద్య ఉంటుందని, ఇలా నిరంతర ప్రశిక్షణ వర్గం జరగడం సంతోషదాయకమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆచార్యులు పాల్గొన్నారు. పాఠశాల ప్రధానాచార్యులు కొండూరు నరేష్ తెలియజేశారు.