calender_icon.png 13 December, 2025 | 7:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హోరాహోరీగా పోరు

12-12-2025 12:44:57 AM

మహబూబాబాద్, డిసెంబర్ 11 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో తొలి విడత నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీల మధ్య హోరాహోరీగా పోటీ సాగింది. జిల్లావ్యాప్తంగా 86.99 శాతం పోలింగ్ న మోదయింది. మొత్తంగా ఐదు మండలాల్లో తొలి విడత ఎన్నికలు నిర్వహించారు. గూ డూరు మండలంలో 86.07, ఇనుగుర్తిలో 84.04,  కేసముద్రంలో 88.27, మహబూబాబాద్ లో 87.78, నెల్లికుదురులో 87.65 పోలింగ్ శాతం నమోదయింది. జిల్లావ్యాప్తంగా ఐదు మండలాల్లోని తొలి విడత 146 గ్రామాల్లో సర్పంచ్, 1,072 వార్డు సభ్యుల ఎన్నిక కోసం పోలింగ్ నిర్వహించారు.

4,110 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 1,72,218 మంది ఓటర్లు గురువారం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రా ష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారుడు, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి స్వగ్రామం కే సముద్రం మండలం అర్పణ పల్లిలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన చీర వెంకటమ్మ విజయం సాధించారు. ఇక మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ స్వగ్రామమైన సోమ్లా తండాలో ఎమ్మెల్యే సమీప బంధువు, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి, రెబల్ అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు.

కేసముద్రం మా ర్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి స్వగ్రామమైన కాలువలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వే ల్పుల సుజాత 600 పై చిలుకు ఓట్లతో ఘనవిజయం సాధించారు. జిల్లాలోని దామరవంచ పంచాయతీ సర్పంచ్ ఎన్నిక ఫలితం వివాదాస్పదంగా మారింది. తొలుత ఓ అభ్యర్థి 3 ఓట్లతో గెలుపొందారని ప్రకటించగా, పరాజయం పాలైన వారు రి కౌంటింగ్ కు డిమాండ్ చేయడంతో మళ్లీ ఓ ట్లు లెక్కించి ఒక్క ఓటుతో ముందుగా ఓడిపోయిన అభ్యర్థి గెలిచినట్టు ప్రకటించారు. దీనితో మొదట విజేతగా ప్రకటించిన అభ్యర్థి మద్దతుదారులు ఆందోళనకు దిగడంతో మరోసారి రికౌంటింగ్  నిర్వహిస్తున్నారు.