12-12-2025 12:41:47 AM
మహబూబాబాద్, డిసెంబర్ 11 (విజయక్రాంతి): గ్రామ ఉపసర్పంచిగా గ్రామ అభి వృద్ధి కోసం విశేషంగా కృషి చేయడంతో ఈసారి జరిగిన ఎన్నికల్లో సర్పంచ్ గా పోటీ చేసిన ఉపసర్పంచ్ ను గ్రామస్తులు సర్పం చ్గా ఎన్నుకున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం బ్రాహ్మణ కొత్తపల్లిలో గురువారం జరిగింది. 2019లో జరిగిన ఎన్నికల్లో ఉప సర్పంచ్ గా ఎన్నికైన చిర్ర యాకాంతం గౌడ్ ఈసారి సర్పంచ్ పదవికి పోటీ చేశారు.
గత టర్ములో ఆయన గ్రామాభివృద్ధికి ఉపసర్పంచిగా చేసిన సేవలను గ్రామస్తులు గుర్తుంచుకొని ఈసారి సర్పంచ్ గా ఎన్నికయ్యేందుకు మద్దతు పలికారు. ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మద్దతుతో పోటీ చేసిన యాకాంతం గౌడ్ సర్పంచిగా ఎన్నికవ్వడం విశేషంగా మారింది.