13-12-2025 06:53:36 PM
* 17 పంచాయతీలు ఏకగ్రీవం..
* 139 పంచాయతీలకు ఎన్నిక..
ఆదిలాబాద్ (విజయక్రాంతి): జిల్లాలో ఈనెల 14న జరిగే 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఎన్నికల నిర్వహణకు జిల్లా అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ గట్టి పోలీస్ బందోబస్తులు ఏర్పాటు చేసింది. 2వ విడతలో ఆదిలాబాద్ రూరల్, బేల, జైనథ్, సాత్నాల, బోరజ్, మావల, భీంపూర్, తాంసి మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ 8 మండలాల్లో మొత్తం 156 గ్రామ పంచాయతీలు ఉండగా, ఇప్పటికే 17 గ్రామ పంచాయతీలో సర్పంచ్ లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో 139 పంచాయతీలకు 14వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి.
ఆయా మండలాల్లో ఏకగ్రీవమైన పంచాయతీలు..
ఆదిలాబాద్ రూరల్- 4
పెద్దమాలే బోరిగాం, అసోద, అల్లికోరి, అత్తిగుట్ట బేలలో-1
చాంద్ పల్లి, జైనథ్ లో-1
అడ, బోరజ్ లో-1
పూసాయి, భీంపూర్ లో-5
మార్క గూడ, జల్ కోరి, కరుణ్ వాడి, టెక్డి రాంపూర్, భగవాన్ పూర్ సాత్నాలలో-2
పార్డి (బి), జంబుల్ దరి తాంసి లో- 3 లింగుగూడ, అట్నమ్ గూడ, అంబుగాం పంచాయతీల్లో సర్పంచ్ లు ఏకగ్రీవం అయ్యాయి. కాగా మావల మండలంలో ఉన్న 3 పంచాయతీల్లో ఒక్కటి కూడా ఏకగ్రీవం కాలేదు.