calender_icon.png 13 December, 2025 | 8:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గల్ఫ్ దేశాలకు వెళ్లేవారు.. అన్ని తెలుసుకోవాలి

13-12-2025 06:58:38 PM

ఖానాపూర్ (విజయక్రాంతి): ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం విదేశాలకు వెళ్లేవారు అధికారికంగా జారీ చేసిన వీసాలని తీసుకోవాలని ప్రవాస మిత్ర లేబర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్వదేశీ పరికిపండ్లఎన్ ఆర్ ఐ అడ్వైసరీ కమిటి రాష్ట్ర సభ్యులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి అన్నారు శనివారం కానాపూర్ పట్టణంలో గల్ఫ్ కార్మికుల సందేహాలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గల్ఫ్ కార్మికుల సందేహాలకు, సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై హెల్ప్ లైన్ నెంబరు +91 94910 53622 కు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారి హైదరాబాద్ లోని 'క్షేత్రియ ప్రవాసీ సహాయత కేంద్రం' హెల్ప్ లైన్ నెంబర్ +91 40 2777 2557 కు కాల్   చేయాలన్నారు ఢిల్లీ కెనేడియన్ హై కమీషన్ రిటైర్డ్ అధికారి, నిర్మల్ వాసి డా. టి. సంపత్ కుమార్ గారు అనేక సూచనలు, సలహాలు ఇవ్వగ, యూనియన్ కోఆర్డినేటర్ కంటం రాజకుమార్, దుబాయ్ రిటని కార్మికులు చిన్న మల్లేష్, మహేందర్, సోన్న మహేష్, అమృత రాజు,బామ్మడ్ల సంతోష్,వకీల్, వివిధ మండలాల గల్ఫ్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.