28-11-2025 01:19:15 AM
భద్రాచలం, నవంబర్ 27, (విజయక్రాంతి): భద్రాచలం శాసనసభ నియోజకవర్గ పరిధిలోని భద్రాచలం దుమ్ముగూడెం చర్ల మండల కేంద్రాలలో గురువారం నాడు గ్రామపంచాయతీ సర్పంచ్ వార్డు మెంబర్ల నామినేషన్ కార్యక్రమాలు కోలాహాలంగా ప్రారంభమయ్యాయి. సుమా రు 12 సంవత్సరాల అనంతరం గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగుతూ ఉండటంతో ప్రజలు నాయకులు నామినేషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.
నామినేషన్స్ ప్రారంభ తేదీ అయిన గురువారం మేజర్ గ్రామపంచాయతీ ఆయన భద్రాచలం గ్రామపంచాయతీకి గురువారం పలువురు నామినేషన్ దాఖలు చేశారు. సర్పంచ్ అభ్యర్థిత్వానికి బిఆర్‌ఎస్ మద్దతుతో మనే రామకృష్ణ అలాగే కాంగ్రెస్ పార్టీ నుండి పోడియం కృష్ణ నామినేషన్లు దాఖలు చేశారు. అంతేకాకుండా వార్డ్ మెంబర్లుగా గాడి పెళ్లి హనుమంతరావు , బొంబోతుల రాజీవ్, దారపునేని వసంతకుమారి, నర్ర రాము, రత్నం కవిత, అభినేని వినీల, నిట్ట రాజు, రేపాక పూర్ణచంద్రరావు, కావూరి గోపి, ఇల్ల మల్ల అశోక్, హక్కుల జ్యోతి లు నామినేషన్ దాఖలు చేశారు.
అంతేకాకుండా దుమ్మగూడెం మండలం లో మొత్తం 26 పంచాయతీలు ఉండగా 11 మంది సర్పంచ్ ఎన్నిక లకు, ఎనిమిది మంది వార్డ్ మెంబర్లు నామినేషన్ కి దాఖలు చేశారు. అంతేకాకుండా చర్ల మండలం లో 26 గ్రామ పంచాయతీలకు 13 గ్రామ పంచాయతీలకు సర్పంచ్ అభ్యర్థులు దాఖలు చేయగా 5 గురు వార్డు మెంబర్లు దాఖలు చేశారు. అయితే నామినేషన్ వేసే అభ్యర్థులు బ్యాంక్ ఎకౌంటు నూతన ఖాతాను తీసుకువసిన క్రమంలో కొందరు బ్యాంక్ అకౌంట్లు రాక నామినేషన్ పోస్ట్ పోన్ చేసుకున్నారు.
మళ్ళీ తిరిగి ఎల్లుండి నామినేషన్ వేయనున్నారు.. నూతన బ్యాంక్ ఎకౌంటు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని నామినేషన్ అభ్యర్థులు వాపోతున్నారు.. భద్రాచలంలో గ్రామపంచాయతీ నామినేషన్ ప్రక్రియను తాసిల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు ఎండిఓ నారాయణరావు పంచాయతీ ఈవో శ్రీనివాస్ లు పర్యవేక్షించగా సీఐ నాగరాజు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు.