15-05-2025 12:00:00 AM
హైదరాబాద్, మే 14 (విజయక్రాంతి): విదేశాల్లోనూ బీఆర్‌ఎస్ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్టు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు. ఇందులో భాగంగా జూన్ 2న అమెరి కాలోని డల్లాస్‌లో సభ జరపనున్నట్టు తెలిపారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ లో బుధవారం డల్లాస్‌లో జరిగే రజతోత్సవ సభ పోస్టర్‌ను శ్రీనివాసయాదవ్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా తలసాని మాట్లాడు తూ.. ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ బిడ్డలు, తెలుగువారు తెలంగాణ ఆవిర్భావ వేడుకలను నిర్వహిస్తున్నారన్నారు. కేసీఆర్ సీఎం గా ఉన్న పదేళ్లలో అద్భుతాలు జరిగాయని, హైదరాబాద్ అభివృద్ధి చెందిందన్నారు.
బీఆర్‌ఎస్ గ్లోబల్ ఎన్నారై సెల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల మాట్లాడుతూ రజతోత్సవా లను విదేశాల్లో ఘనంగా జరుపుతున్నామని, డల్లాస్ సభకు కేటీఆర్ హజరవుతారని చెప్పారు. అమెరికా, యూకే, ఆస్ట్రేలి యా, కెనడా తదితర దేశాల్లో సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుగుతాయని చెప్పారు. ఎమ్మె ల్యే కే సంజయ్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, బీఆర్‌ఎస్ నేతలు చందు తాళ్ల, అభిలాశ్ రంగినేని, పుట్టా విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.