12-01-2026 12:00:00 AM
ఎమ్మెల్యే పాయల్ శంకర్
ఆదిలాబాద్, జనవరి 11 (విజయక్రాంతి): పీడిత వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు వడ్డే ఓబన్న అని ఎమ్మెల్యే పాయల్ శంకర్ కొనియాడారు. జిల్లా కేంద్రంలో ఆదివారం వడ్డే ఓబన్న జయంతిని పురస్కరించుకుని బస్టాండ్ ఎదురుగా ఏర్పాటు చేసిన ఆ మహనీయుని విగ్ర హాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు.ఈ సందర్భం గా అధికారులు, బీసీ, వడ్డెర సంక్షేమ సంఘం నాయకులు ఓబన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... వడ్డే ఓబన్న జయంతిని ప్రభుత్వ పరంగా అధికారికంగా నిర్వ హించడం గర్వకారణమని, వారి పోరాట గాథలను నేటి తరాలకు పరిచయం చేయడంలో ఇవి కీలకమని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి రాజలింగు, బీసీ సంఘం అధ్యక్షుడు చిక్కాల దత్తు, వడ్డెర సంక్షేమ సంఘం నాయకులు, సభ్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.