27-01-2025 12:00:00 AM
హాకీ ఇండియా వుమెన్స్ లీగ్
రాంచీ: ఇనాగురల్ వుమెన్స్ హాకీ ఇండి యా లీగ్ ట్రోఫీని ఒడిశా వారియర్స్ దక్కించుకుంది. ఫైనల్లో ఆ జట్టు జేఎస్‌డబ్ల్యూ సూర్మా క్లబ్ మీద విజయం సాధించి ట్రో ఫీని ఒడిసిపట్టింది. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో జేఎస్‌డబ్ల్యూ సూర్మా హాకీ క్లబ్ మీద ఒడిశా వారియర్స్ 2-1 తేడాతో గెలిచి ట్రోఫీని ముద్దాడింది.
తొలి క్వార్టర్‌లో ఇరు జట్లు గోల్ కోసం శ్రమించినా ఫలితం మా త్రం రాలేదు. ఇక రెండో క్వార్టర్‌లో ఒడిశా ముందు గోల్స్ ఖాతాను తెరిచింది. ఆ జట్టు తరఫున ఆట 20వ నిమిషంలో రుతుజా ఫీల్డ్ గోల్ చేయడంతో ఒడిశా 1-0 తేడాతో లీడ్‌లోకి దూసుకెళ్లింది. అయితే ఒడిశాకు ఆ ఆధిక్యం ఎంతో సేపు నిలవలే దు.
ఆట 28వ నిమిషంలో సూర్మా క్లబ్ ప్లేయర్ పెన్నీ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి స్కోర్లు 1-1తో సమం చేసింది. దీంతో మ్యాచ్ మరింత రసవత్తరంగా మారింది. ఇక మూడో క్వార్టర్‌లో ఇరు జట్లు గోల్ కోసం తీవ్రంగా శ్రమించినా కానీ వారికి ఫలితం దక్కలేదు. నాలుగో క్వార్టర్‌లో ఒడిశాకు రుతుజా మరోసారి ఊపిరిలూదింది.
ఆట 56వ నిమిషంలో గోల్ చేసి జట్టుకు విజయాన్ని అందించింది. మిగిలిన సమయం లో గోల్ కోసం సూర్మా క్లబ్ ఎంత ప్రయత్నించినా కానీ ఫలితం మాత్రం దక్కలేదు.