27-01-2025 12:00:00 AM
కౌలాలంపూర్: అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత అమ్మాయిలు తమ జోరును కొనసాగిస్తున్నారు. ఆదివారం బంగ్లాదేశ్ అమ్మాయిలతో జరిగిన సూపర్ సిక్స్ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించారు. ఈ విజయంతో భారత్ సెమీఫైనల్ బెర్తుకు మరింత చేరువయింది.
టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్న భారత అమ్మాయిలు బంగ్లాదేశ్ ముప్పుతిప్పలు పెట్టారు. భారత బౌలర్ల ధాటికి బంగ్లా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 64 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్ల దెబ్బకు ఏకంగా ఏడుగురు బంగ్లా బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు.
వైష్ణవి శర్మ మూడు వికెట్లతో సత్తా చాటింది. 65 పరుగుల స్ప ల్ప టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత్ ఆడు తూ పాడుతూ 7.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యం చేధించింది. మూడు వికెట్లతో బంగ్లా నడ్డి విరిచిన వైష్ణవికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.