calender_icon.png 11 May, 2025 | 6:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాక్ దాడులకు అధికారి బలి

11-05-2025 01:49:12 AM

  1. మరో నలుగురు కూడా మృతి
  2. జమ్మూ రాజౌరిలో ఘటన
  3. విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా

రాజౌరి, మే 10: జమ్మూకశ్మీర్‌లోని రా జౌరి జిల్లా డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా పని చేస్తున్న రాజ్‌కుమార్ థప్పా (55) పాక్ డ్రోన్ దాడిలో ప్రాణాలు వదిలారు. ఆయనతో పాటు మరో నలుగురు వ్యక్తులు కూ డా పాక్ దాడులకు బలయ్యారు. రాజౌరిలో రాజ్‌కుమార్ థప్పా ఉంటున్న నివాసంపై పాకిస్థాన్ ప్రయోగించిన ఫిరంగి గుండ్లు పడటంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆయన మరణంపై జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సంతాపం వ్యక్తం చేశారు.

‘పాక్ దాడులతో నిబద్ధత కలిగిన ఓ అధికారిని కోల్పోయాం. ఒక్కరోజు ముందు కూడా ఆయన ఆన్‌లైన్ సమావేశంలో పా ల్గొన్నారు. ఇంతలోనే ఇలా జరగడం బాధాకరం. ఈ పరిణామం మాకెంతో నష్టం.’ అని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.