calender_icon.png 11 May, 2025 | 12:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘సిందూర్’లో కీలక ఉగ్రవాదుల హతం

11-05-2025 01:48:19 AM

-భారత్ ప్రతీకార దాడులతో ఉగ్రముఠాలకు కోలుకోలేని దెబ్బ

- 100మంది ఉగ్రవాదులు మృతి

- చనిపోయిన ఐదుగురు టాప్ ఉగ్రవాదులు

- మృతుల్లో మసూద్ అజార్ ఇద్దరు బావమరుదులు 

న్యూఢిల్లీ, మే 10: పహల్గాం దాడికి భారత్ గట్టిగా ప్రతీకారం తీర్చుకుంది. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో లష్కరే తయ్యిబా, జైషే ఉగ్రముఠాలే లక్ష్యంగా వాటి స్థావరాలపై దాడులు చేసి కీలక ఉగ్రవాదులను హతమార్చింది.

ఈనెల 7వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత పాకిస్థాన్, పీవోకేల్లో జరిపిన మెరుపుదాడుల్లో 9 కీలక ఉగ్రశిబిరాలను నేలమట్టం చేసింది. ఈ ఆపరేషన్ సిందూర్‌లో కనీసం 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు ఇటీవల కేంద్రం ప్రకటించింది. ఇందు లో ఐదుగురు కీలక ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది.

జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు మసూ ద్ అజార్ ఇద్దరు బావమరదులతో పాటు లష్కరే తయి ్యబా ముఠాకు చెందిన కీలక ఉగ్రవాది, మరో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు హతమైన ఉగ్రవాదుల జాబితా బయటకువచ్చింది. 

హఫీజ్ మహమ్మద్ జమీల్

జైషే మహమ్మద్ ఉగ్రముఠాలోని కీలక సభ్యుడు. ఆ సంస్థ వ్యవస్థాపకుడు మసూద్ అజార్‌కు పెద్ద బావమరిది.

ముదస్సర్ ఖదాయిస్ ఖాస్ అలియాస్ అబు జుండాల్

ఇతడు లష్కరే తయ్యిబా ముఠాకు చెందిన కీలక ఉగ్రవాది. ఇతడి అంత్యక్రియలను పాక్ ఆర్మీ లాంఛనాలతో నిర్వహించింది. అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ అబ్దుల్ రౌఫ్ నేతృత్వంలో జరిగిన కార్యక్రమానికి పాక్ ఆర్మీ చీఫ్, పంజాబ్(పాక్) సీఎం, ఐజీ పాల్గొన్నట్లు తెలుస్తోంది.

మహమ్మద్ యూసఫ్ అజార్..

జైషే ముఠాకు చెందిన మరో కీలక ఉగ్రవాది. మ సూద్ అజార్ మరో బావమరిది అయిన అజార్..ఐసీ విమాన హైజాక్ ఘటనలో ప్రధాన నిందితుడు.

మహమ్మద్ హసన్ ఖాన్

జైషే మహమ్మద్ ముఠాలో కీలక సభ్యుడు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని జైషే ఆపరేషనల్ కమాండర్ ముఫ్తి ఆస్గర్ ఖాన్ కశ్మీరీ కుమారుడు. జమ్మూకశ్మీర్‌లోకి ఉగ్రవాదులను పంపించడంలో కీలకపాత్ర పోషించాడు.

ఖలీద్ అలియాస్ అబు ఆకాస

లష్కరే తయ్యిబాకు చెందిన కీలక ఉగ్రవాది. జమ్మూ కశ్మీర్‌లో పలు ఉగ్రదాడులకు నేతృత్వం వహించాడు. అఫ్గానిస్థాన్ నుంచి ఆయుధాల స్మగ్లింగ్ చేసేవాడు. ఫైసలాబాద్‌లో జరిగిన ఇతడి అంత్యక్రియలకు పాక్‌లోని సీనియర్ ఆర్మీ అధికారులు, స్థానిక డిప్యూటీ కమిషనర్ హాజరైనట్లు సమాచారం.