calender_icon.png 4 August, 2025 | 4:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రమాదపు అంచున ఊర చెరువు కట్ట పట్టించుకోని అధికారులు

25-07-2025 02:04:00 AM

ఆందోళనలో వాయిలసింగవరం గ్రామ రైతులు

అనంతగిరి, జులై 24 :మండల పరిధిలో గల వాయిలసింగవరంగ్రామ ఊరు చెరువు కట్ట తెగిపోయే ప్రమాదం ఉందని వాయిల సింగవరం గ్రామ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గత వానాకాలం సీజన్ లో కురిసిన వర్షాలవలన ఊర చెరువు నిండి ఊరకాలువ దగ్గర కట్టతెగిపోయే ప్రమాదం ఏర్పడగా అప్పుడు రైతులు తాత్కాలిక మరమ్మత్తు చేసుకొన్నారు? ఇట్టివిషయాన్ని వార్తా పత్రికల ద్వారా అధికారులకు తెలియజేయగా ఇరిగేషన్ అధికారులు వచ్చి చూసి కట్ట మరమ్మత్తులు చేయిస్తామని రైతులకు హామీ ఇచ్చారు.

కానీ నేటివరకు ఎలాంటి మరమ్మత్తులు చేయలేదు ఇటీవల కురుస్తున్న వర్షాలకు చెరువు నిండి మరలా తెగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెరువు కట్టకు మరమ్మత్తులు చేయించి ఇబ్బందులు కలగకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. ఈసారి అధికారులు స్పందించని పక్షంలో కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామని రైతులు కొల్లు సుబ్బారావు, జొన్నలగడ్డ సైదులు, రేవూరి శ్రీనివాసరావు, వేముల పుల్లయ్య, వీరబోయిన వెంకటేశ్వర్లు, కంటు శ్రీకాంత్, రేవూరి చంద్రయ్య, రేవూరి సైదులు, కంటు కృష్ణ  తెలిపారు