25-07-2025 02:03:47 AM
కాప్రా, జులై 24 : కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం బాలుడు అదృశ్యమైన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, 14 సంవత్సరాల రిషియేంద్ర అనే బాలుడు తన తాత వద్ద నివాసముండి చదువుకుంటున్నాడు. బుధవారం రోజు తాత మందలించడంతో, మనస్తాపానికి గురైన బాలుడు ఇంటి నుండి బయటకు వెళ్లిపోయాడు.
ఈ మేరకు కుటుంబ సభ్యులు కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు వెంటనే స్పందించి సాంకేతిక సమాచారంతో పాటు స్థానిక పరిశీలన ద్వారా బాలుడి ఆచూకీని క్షణాల్లో కనుగొన్నారు. పోలీసులు బాలుడిని సురక్షితంగా గుర్తించి, అతన్ని తిరిగి అతని తాత సంరక్షణలో అప్పగించడం జరిగింది. ఈ సందర్భంగా బాలుడి కుటుంబ సభ్యులు పోలీసుల వేగవంతమైన చర్యలపై కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల రక్షణలో కుషాయిగూడ పోలీసులు చూపిన నిబద్ధత ప్రశంసనీయం అని పేర్కొన్నారు.