calender_icon.png 19 November, 2025 | 10:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చీరల పంపిణీ కార్యక్రమంలో అధికారులు సమన్వయంతో నిర్వహించాలి

19-11-2025 08:31:19 PM

అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య

వనపర్తి టౌన్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిర మహిళా శక్తి పథకంలో భాగంగా మహిళల కోసం చేపట్టిన చీరల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లాలో సంబంధిత అధికారులు సమన్వయంతో పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ ఇందిరా మహిళా శక్తి లో భాగంగా మహిళ స్వయం సహాయక బృందాల సభ్యులకు చీరల పంపిణీ కార్యక్రమం ఏర్పాట్లపై ఎంపీడీవోలు, ఏపీఎంలు, పంచాయతీ కార్యదర్శులు, సీసీలు, ఫీల్డ్ అసిస్టెంట్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. 

అదనపు కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం "మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి" పేరుతో ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా మహిళల ఆత్మగౌరవాన్ని పెంపొందిస్తూ చీరల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఈ చీరల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులందరూ సమన్వయంతో సమర్ధవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. రేపటి నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు ఈ కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. కాబట్టి ఏపీఎంలు, సీసీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. సమావేశంలో డిపిఓ తరుణ్ చక్రవర్తి, డిప్యూటీ సీఈవో రామ మహేశ్వర్, పంచాయతీరాజ్ ఈఈ మల్లయ్య, అదనపు డి ఆర్ డి ఓ, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.