19-11-2025 08:32:59 PM
కొత్తపల్లి (విజయక్రాంతి): బిజెపి జిల్లా పార్టీ ఆధ్వర్యంలో హుజురాబాద్లో బుధవారం జరిగిన బూత్ సమ్మేళనంలో పశ్చిమజోన్ నుండి బూత్ అధ్యక్ష, కార్యదర్శులు, సోషల్ మీడియా కన్వీనర్లు, బిజెపి నాయకులు జాడి బాల్ రెడ్డి, నరహరి లక్ష్మారెడ్డి, శ్రీనివాసరెడ్డి, విష్ణు ప్రసాదరావు, ఈ రెడ్డి తిరుమలరెడ్డి, పోతు జగదీష్, శీతాలరమేష్చంద్ర, పరశురాములు, నరసింహారెడ్డి, లక్ష్మీరాజo, ప్రతాపరెడ్డిలు తరలి వెళ్లారు. ఈ సమావేశంలో కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, కేంద్ర హోం శాఖ మాత్యులు బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి బూత్ లోని ఓటర్లతో మమేకమై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లోచేసిన వాగ్దానాలు అమలు చేయడంలో విఫలమైందని గడపగడపకు వెళ్లి బూత్ కమిటీప్రచారం చేస్తూ అత్యధిక సంఖ్యలో బిజెపి అభ్యర్థులను గెలిపించుకోవాలని తెలియజేశారు.