calender_icon.png 19 November, 2025 | 9:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోటి మంది మహిళలకు చీరలు పంపిణీ..

19-11-2025 08:29:58 PM

జిల్లా కలెక్టర్లు, మహిళా సంఘం సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ 

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి

గద్వాల: ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కోటి మంది మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్ నుండి సహచర మంత్రులతో కలిసి చీరల పంపిణీ కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, మహిళా సంఘం సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, కోటి మంది మహిళలకు కోటి చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ముందుగా గ్రామీణ ప్రాంతాలలో ఈరోజు నుండి డిసెంబర్ 9 వరకు ఇందిరమ్మ చీరల పంపిణీ, మార్చ్ ఒకటి నుండి 8వ తేదీ వరకు పట్టణ ప్రాంతాలలో ఏందిరా అమ్మ చీరలో పంపిణీ నిర్వహించడం జరుగుతుందన్నారు.  పండగ వాతావరణంలో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా స్థానిక ప్రజా ప్రతినిధులను భాగస్వాములు చేస్తూ చీరల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.  కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళుతుందని తెలిపారు.

జిల్లా కు 86 వేల చీరలు అందాయి... జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్

జిల్లాలో 80 వేల మంది మహిళా సభ్యులు ఉండగా, జిల్లాకు 86 వేల చీరలు అందినట్లు  జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ తెలిపారు. ఇట్టి చీరలను ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లాలోని రెండు నియోజకవర్గాలకు ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో అన్ని గ్రామాలకు పంపిణీ చేసి ఏపీఎం, గ్రామ కార్యదర్శులు మహిళా సంఘం సభ్యుల పరస్పర సహకారంతో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పంపిణీ కార్యక్రమం నిర్వహించాలన్నారు. పంపిణీ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని వారి సమక్షంలో పండగ వాతావరణంలో పంపిణీ కార్యక్రమం చేపట్టాలన్నారు. ప్రతి లబ్ధిదారుని ఫోటోతో పాటు ఆధార్ నెంబరు సేకరించాలని సూచించారు. 

రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యులను కోటీశ్వరులు చేయాలని లక్ష్యంతో విరివిగా వడ్డీలేని బ్యాంకు రుణాలను అందించడం జరుగుతుందని, వారి ఆర్థిక అభివృద్ధి కోసం బస్సులు పెట్రోల్ బంకులు సోలార్ ప్లాంట్ లు కూడా జిల్లాలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మహిళలు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, జిల్లా పంచాయతీ అధికారి నాగేంద్రం, అడిషనల్ డి ఆర్ డి ఓ శ్రీనివాస్, జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు ప్రభావతి, మహిళా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.