calender_icon.png 11 October, 2025 | 4:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా గల్లీలో నీళ్లు రాక మూడు రోజులు ఆయే

11-10-2025 12:48:17 AM

గ్రామీణ నీటిపారుదల శాఖ అధికారులు ఇటువైపు రాకనే పాయి

తాగునీటి ఘోష తీర్చని అధికారులు, ఇంటికి ఎన్ని పైసలు వేసి మా గల్లీ మోటర్ బాగు చేసుకున్నాం

పలుమార్లు మండల పరిషత్ అధికారికి చెప్పిన పని కాలే

ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): మా గల్లీలో నీళ్లు లేక మూడు రోజులుగా తీవ్ర అవస్థలు పడుతున్న ఇటువైపు అధికారులు పట్టనట్టు,వ్యవహరిస్తున్నారని, ఆ గల్లి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎల్లారెడ్డి మండలంలోని వెలుట్ల గ్రామపంచాయతీ పరిధిలోని ఓ కాలనీలో, (మీదాడ కట్టు,) మూడు రోజుల నుండి త్రాగునీరు రాక ఇబ్బందులు పడుతున్నారు. కాలనీలో ఉన్న బోరు బావి మోటారు చెడిపోవడంతో ఏ అధికారులు పట్టించుకోకపోవడంతో కాలనీవాసులు ఇంటికి 50 రూపాయలు వేసుకొని బోరు మోటర్ ను రిపేర్ చేయించుకొని నూతన స్టార్టర్ ను బాగు చేసుకున్నారు.

సమస్యల పట్ల పలుమార్లు పంచాయతీ కార్యదర్శి, గ్రామీణ త్రాగునీటి నీటిపారుదల శాఖ అధికారులకు, పలుమార్లు విన్నవించిన ఫలితం శూన్యమే కావడంతో కాలనీవాసులే తలాయిని డబ్బులు పోగుచేసుకొని నీటి సమస్యను తీర్చుకున్నామని ఆ కాలనీవాసులు అన్నారు. పలుమార్లు మండల పరిషత్ కు వెళ్లి మండలా పరిషత్ అధికారికి తమ గోడు వెళ్ళబోసుకున్న అధికారులు చూసుకుంటారు, అంటూ పంపిస్తున్నారు. దయచేసి మా కాలనీకి తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను వేడుకుంటున్నారు.