16-12-2025 12:37:56 AM
బ్రహ్మోత్సవాలకు లక్షల్లో రానున్న భక్తులు
జనవరి రెండో వారంలో జాతర
మంత్రి పొన్నం చొరవ తీసుకోవాలి
భీమదేవరపల్లి, డిసెంబర్ 15 (విజయక్రాంతి) ఉత్తర తెలంగాణ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొత్తకొండ వీరభద్రుని బ్రహ్మోత్సవాలకు వెళ్లే రహదారి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తారు రోడ్డు అనుకునే పెద్ద ఎత్తున గండ్లు పడడంతో రహదారి పలుచోట్ల పూర్తిగా ప్రమాదకరంగా మారింది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం లో కొత్త కొండ వీరభద్రుని బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా జనవరి మాసం రెండవ వారంలో జరుగుతాయి.
కొత్తకొండ వీరభద్రుని బ్రహ్మోత్సవాలకు పది లక్షలకు పైగా భక్తులు విచ్చేసి వీరభద్ర స్వామి వారిని దర్శించుకుంటారు. వీరభద్రుని దర్శించేందుకు భక్తులు వేలాది గా వివిధ వాహనాల్లో వస్తుంటారు. దర్శనానికి వచ్చే భక్తులు ఏ మాత్రం అదమర్చి వాహనాన్ని నడిపితే తారు రోడ్డు పక్కనే గండ్లు పడిన చోట పడే అవకాశాలు ఉన్నాయి. జాతరకు దాదాపుగా వేల సంఖ్యలో వివిధ డిపోలో చేరిన ఆర్టీసీ బస్సులు వస్తుంటాయి.
ఈ విషయంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి యుద్ధ ప్రాతిపదికన రోడ్డుకు ఆనుకొని ఉన్న గుంతలు పూడ్చకపోతే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. వెంటనే నిధులు మంజూరు చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేస్తున్నారు.