16-12-2025 12:39:05 AM
మహబూబాబాద్, డిసెంబర్ 15 (విజయక్రాంతి): గ్రామపంచాయతీ తుది పో రుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 564 గ్రామపంచాయతీల్లో సర్పంచ్ పదవులకు, 4,896 వార్డు మెంబర్ పదవులకు ఈనెల 17న ఉద యం ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒం టిగంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.
తుది దశ పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసే సర్పంచ్ వార్డు సభ్యుల అభ్యర్థులు సో మవారం సాయంత్రం తమ ప్రచారాన్ని ము గించారు. ఎన్నికల నిర్వహణకు విధులు కేటాయించిన ఉద్యోగులకు సిబ్బందికి ర్యాం డమైజేషన్ పూర్తి చేశారు. ఏకగ్రీవం అయినచోట ఎన్నికల విధులకు మినహాయింపు ఇచ్చారు.
మహబూబాబాద్ జిల్లాలో...
మహబూబాబాద్ జిల్లాలో మూడో విడ త గ్రామపంచాయతీ ఎన్నికలు ఆరు మండలాల్లో జరగనున్నాయి. డోర్నకల్, మరిపెడ, కురవి, కొత్తగూడా, సీరోల్, గంగారం మండలాల్లోని 150 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తుండగా 495 అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అలాగే 1,138 వార్డ్ మెంబర్ స్థానాలకు 2,857 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.
మూడో విడత జరిగే ఎన్ని కల్లో 1,60,587 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడానికి 1,138 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణకు 13 మంది జోనల్ అధికారులు, 61 మంది రూట్ అధికారులు, 1 ఏ.ఆర్.ఓ, ఆర్.ఓ-II 202, పి.ఓ లు1,732, ఓ.పి.ఓ లు 1,894, వెబ్క్యాస్టింగ్ కోసం 38, 8 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. ఏర్పాట్లను అధికారులతో కలిసి జిల్లా అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో సోమవారం సమీక్షించారు.