10-07-2025 09:58:47 PM
ఎల్లారెడ్డి (విజయక్రాంతి): ఎల్లారెడ్డి తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాల ఎల్లారెడ్డిలో 5వ తరగతి నుండి 8వ తరగతి వరకు ముస్లిం మైనార్టీ విద్యార్థులకు అపరిమిత సంఖ్యలో సీట్లు ఇవ్వడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు ప్రిన్సిపల్ మహమ్మద్ రఫత్(Principal Mohammad Rafat) తెలిపారు. గతంలో కేవలం తరగతికి పదిమంది నాన్ మైనారిటీ, 30 మంది ముస్లిం మైనారిటీ విద్యార్థులకు మాత్రమే అనుమతి ఉండేదన్నారు. ప్రభుత్వం 30 విద్యార్థుల పరిమితిని ఎత్తివేసి ముస్లిం విద్యార్థులకు సువర్ణ అవకాశం కల్పించిందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఎల్లారెడ్డిలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో చేర్పించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలన్నారు. ఎల్లారెడ్డిలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో 9, 10 తరగతుల్లోనూ పరిమిత సంఖ్యలో ముస్లిం మైనార్టీ విద్యార్థులకు సీట్లు అందుబాటులో ఉన్నాయని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ మొహమ్మద్ రఫత్ కోరారు. వివరాలకు పాఠశాలలో సంప్రదించాలన్నారు.