08-09-2025 09:41:17 PM
మంథని, సెప్టెంబర్ 08(విజయ క్రాంతి) గోదావరి పరివాహక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. సోమవారం మంథని పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీపీ స్టేషన్ పరిసరాలను పరిశీలిమచడంతో పాటు, స్టేషన్ భౌగోళిక పరిస్థితులు, సిబ్బంది పనీతీరు, స్టేషన్ పరిధిలో అధికంగా నమోదయ్యే కేసుల వివరాలతో పాటు, గ్రామాల వివరాలను మంథని సీఐ రాజు ను అడిగి తెలుసుకున్నారు. రిసెప్షన్ సిబ్బందితో మాట్లాడి రికార్డ్ లను పరిశీలించి, పోలీస్ స్టేషన్ పెండింగ్ కేసులపై సీపీ ఆరా తీయడంతో పాటు నేరాల నియంత్రణ కు తీసుకుంటున్న చర్యలను సీఐ రాజు, ఎస్ఐ రమేష్ ని అడిగి తెలుసుకొన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలను సందర్శించాలని, గట్టి నిఘా ఉంచాలని అధికారులకు సీపీ సూచించారు.