calender_icon.png 9 September, 2025 | 2:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బావిలో దూకి యువకుడు మృతి

08-09-2025 09:23:07 PM

లక్షెట్టిపేట,(విజయక్రాంతి): మండలంలోని వెంకట్రావుపేట గ్రామ శివారులో వ్యవసాయ బావిలో దూకి దండేపల్లి మండలం కొర్విచెల్మ గ్రామానికి చెందిన వేనంక  వినయ్ బాబు (26) అనే యువకుడు సోమవారం ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడని ఎస్సై సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సై సురేష్ తెలిపిన వివరాల ప్రకారం... మృతుడు తన స్వగ్రామం కొర్విచెల్మ లో ఒక అమ్మాయిని ప్రేమించాడని తను ప్రేమించిన అమ్మాయి ఆదివారం చనిపోడంతో తను ప్రేమించిన అమ్మాయి చనిపోవడం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయాడని తెలిపారు. మృతుని తల్లి వేనంక రాజవ్వ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం జరుగుతుందని ఎస్సై తెలిపారు.