calender_icon.png 9 September, 2025 | 2:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ రాష్ట్రంలో పర్యటించాలని నేషనల్ ఎస్సీ కమిషన్ కు విజ్ఞప్తి

08-09-2025 09:12:43 PM

ఆర్పిఐ జాతీయ నేత కొంపల్లి ప్రభుదాస్

సిద్దిపేట,(విజయక్రాంతి):  నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వనా, సామాజిక న్యాయ శాఖ  మంత్రి రాందాస్ అత్వాలేలను పలు సమస్యలపై రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ ఆర్గనైజర్, ఆంధ్ర, తెలంగాణ అబ్జర్వర్ కొంపల్లి ప్రభుదాస్ సోమవారం డిల్లీలో కలిశారు. తెలంగాణలోని ఎస్సీలపై జరుగుతున్న దౌర్జన్యాలు దానికి తోడు అధికారుల నిర్లక్ష్యవైఖరి, ఎస్సీలపై జరుగుతున్న అన్యాయాలపై విన్నవించారు. సానుకూలంగా స్పందించిన కమిషన్ చైర్మన్ త్వరలో తెలంగాణలో సమీక్ష నిర్వహించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని ప్రభుదాస్ తెలిపారు.