08-09-2025 09:43:37 PM
కామారెడ్డి, సెప్టెంబర్ 8 (విజయ క్రాంతి), తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ సహకారంతో 6వ రాష్ట్రస్థాయి యోగా ఛాంపియన్ షిప్ లో కామారెడ్డి జిల్లా యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్ విద్యార్థినీలు పలు విభాగాల్లో 17 మెడల్స్ సాధించారు. విజేతలుగా నిలిచి రాష్ట్రస్థాయి ఛాంపియన్ షిప్ టోపీని సాధించారు. మొదటి సారిగా కామారెడ్డి జిల్లాకు తీసుక రావడం గర్వ కారణంగా ఉందని జిల్లా యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు యోగ రామ్ రెడ్డి ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రస్థాయిలో నిర్వహించిన యోగ పోటీల్లో విద్యార్థులు 19 మెడల్స్ సాధించి రాష్ట్ర శాంపియన్షిప్ ట్రోఫీని కైసం చేసుకోవడం ఆశించ దగ్గర విషయమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తే జిల్లా నుండి కండంతరాలు దాటి పథకాలను సాధించడానికి యోగ సాధకులు కఠోరమైన శ్రమతో కృషి చేస్తున్నారని ఆయన అన్నారు.
ఈనెల 5,6,7 తేదీలలో నిర్మల్‌లో పట్టణములో నిర్మల్ జిల్లా యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి యోగా పోటీలు నిర్వహించడం జరిగింది. విద్యార్థినిలు (కేజీబీవీ విద్యార్థులు )పలు విభాగాలలో విజేతలుగా నిలిచి రాష్ట్రస్థాయి ఛాంపియన్షిప్ ట్రోఫీని మొదటిసారిగా కామారెడ్డి జిల్లాకు సాధించిన విద్యార్థులకు వారి కోచ్‌లకు కామారెడ్డి జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు యోగా రామ్ రెడ్డి ప్రధాన కార్యదర్శి బి రఘుకుమార్ జిల్లా యోగ సభ్యులుఆనందోత్సవాలతో అభినందనలుతెలియజేశారు. పథకాలు సాధించిన వారి వివరాలు ఇలా ఉన్నాయి.
యోగ సబ్ జూనియర్ విభాగంలో జోష్ణ–సునీత రిధమిక్ పెయిర్‌లో గోల్డ్ మెడల్ బి.నికిత ఆర్టిస్టిక్ సింగిల్ సబ్ జూనియర్ గర్ల్స్‌లో సిల్వర్ మెడల్ కవిత లెగ్ బ్యాలెన్సింగ్‌లో సిల్వర్ మెడల్ సిందుజా హ్యాండ్ బ్యాలెన్సింగ్‌లో గోల్డ్ మెడల్ విగ్నేశ్వరి సుపైన్ ఇండివిడ్యువల్‌లో గోల్డ్ మెడల్ సిరిశా–వైష్ణవి ఆర్టిస్టిక్ పెయిర్‌లో సిల్వర్ మెడల్ అంజలి ట్రెడిషనల్ విభాగంలో ఐదవ స్థానం విఘ్నేష్ సబ్ జూనియర్ బాయ్స్ సుపైన్‌లో 1బ్రాంజ్ జూనియర్ విభాగంలో విజయాలుసహస్ర–సరస్వతి రిధమిక్ పెయిర్‌లో ప్రథమ స్థానం సహస్ర ట్విస్టింగ్ బాడీలో గోల్డ్, లెగ్ బ్యాలెన్సింగ్‌లో గోల్డ్,సరస్వతి బ్యాక్ బెండింగ్‌లో గోల్డ్, ఆర్టిస్టిక్ సింగిల్‌లో బ్రాంజ్, స్రవంతి శైలిశ్రీ ఆర్టిస్టిక్ పెయిర్‌లో గోల్డ్ శ్రావంతి హ్యాండ్ బ్యాలెన్సింగ్‌లో గోల్డ్ కృప సుపైన్ ఇండివిడ్యువల్ విభాగంలో గోల్డ్
హరిణి ట్విస్టింగ్ బాడీవిభాగంలో బ్రాంజ్ మెడల్ నవదీప్ కు జూనియర్ బాలుర విభాగంలో బ్యాక్ బెండింగ్ లో 1గోల్డ్, హ్యాండ్ బ్యాలెన్స్ లో 1గోల్డ్, ఆర్టిస్టిక్ సింగల్ లో 1బ్రాంజ్, అన్ని కలిపి 12గోల్డ్ 3సిల్వర్ 4బ్రాంజ్ మొత్తము 19 మెడల్స్ సాధించి కామారెడ్డి జిల్లాకు మొదటిసారి రాష్ట్ర ఛాంపియన్షిప్ ట్రోఫీని కైవసము చేసుకున్నారు. విద్యార్థినులు ఎంతో సాధన చేయడం వల్లనే కామారెడ్డి జిల్లాకు పథకాల పంట పండిందని ఆయన అన్నారు. ఇలాంటి ప్రతిభావంతులు గల విద్యార్థులు మనకు దొరకడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. కఠోరమైన శ్రమ, నియమం, అభ్యాసం వలన ఈ ఫలితాలుసాధ్యమయ్యాయని పేర్కొన్నారు.
వారి తల్లిదండ్రులకు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు కోచ్ లకు విద్యార్థులకు మరో ఒకసారి అభినందనలు తెలుపుతూ, భవిష్యత్తులో నేషనల్ స్థాయిలో పతకాలను సాధించడానికి ఇంకా కృషి పట్టుదలతో శ్రమించాలని ఆకాంక్షించారు. యోగ సాధకులు ఖడంతరాలుదాటి పథకాలు సాధించడానికి పట్టుదలతో శ్రమించడానికి సిద్ధంగా ఉన్నవారికి ఉచితంగా శాస్త్రీయ పద్ధతిలో సాధన నేర్పడానికి సిద్ధంగా ఉన్నామని జిల్లా యోగా అధ్యక్షులు రామ్ రెడ్డి విజయ క్రాంతి ప్రతినిధితో మాట్లాడుతూ అన్నారు. కష్టపడితే ఫలితం తప్పకుండా లభిస్తుంది. యోగ సాధన వల్ల ఆరోగ్యం పేరు ప్రఖ్యాతలు వస్తాయని ఈ విషయం విద్యార్థిని విద్యార్థులు గుర్తించాలని ఆయన కోరారు. ఈ యోగాసన పోటీలలో కామారెడ్డి జిల్లా నుండి బాస రఘుకుమార్, అనిల్ రెడ్డి, లక్ష్మీరాజం, గోమతి, వీణ, న్యాయ నిర్ణయితలుగా,గోమతి మేడం,శ్రీలత,లలిత కోచ్ లుగా, భరత్ మేనేజర్ గా వ్యవహరించారు.