19-10-2025 12:20:50 AM
ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు, శరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో రూపొందిన తాజాచిత్రం ‘డ్యూడ్’. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాతో కీర్తీశ్వరన్ డైరెక్టర్‌గా పరిచయమయ్యారు. అక్టోబర్ 17న విడుదలైన ఈ చిత్రబృందం శనివారం హైదరాబా ద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో ప్రదీప్ రంగనాథన్ మాట్లాడు తూ.. “గతంలో నేను నటించిన లవ్ టుడే, డ్రాగన్ సినిమాలను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఇప్పుడు అంతకుమించిన ఆదరణ అభిమానం ‘డ్యూడ్’ సినిమాపై చూపించారు.
ఇంత మంచి విజయాన్ని అందించినందుకు ఆనందంగా ఉంది” అన్నారు. నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ.. “కీర్తి అద్భుతమైన కథ రాసుకొని అద్భుతంగా చేశాడు. ప్రదీప్ నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారు” అని తెలిపారు. మరో నిర్మాత వై రవిశంకర్ మాట్లాడుతూ.. “జెన్‌జీ కాన్సెప్ట్‌లో ఫ్యామిలీ ఎమోషన్స్ బ్లెండ్ చేసి ఒక కొత్త జోనర్ ఫీలింగ్‌ని క్రియేట్ చేసిందీ సినిమా” అని చెప్పారు. మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశిధర్‌రెడ్డి, మిగతా చిత్రబృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.