15-05-2025 12:00:00 AM
సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్
కార్వాన్, మే 14 : ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం అని సౌత్ వెస్ట్ జోన్ డిసిపి చంద్రమోహన్ పేర్కొన్నారు. సౌత్ వెస్ట్ జోన్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఫ్రీడమ్ ఆయిల్ కంపెనీ సౌజన్యం తో ౧౨౩ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశా రు. వాటిని బుధవారం డిసిపి కార్యాలయానికి అనుసంధించారు.
ఈ సంద ర్భంగా డీసీపీ చంద్రమోహన్ మా ట్లాడుతూ.. మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. శాంతి భద్రతలను కాపాడేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో అడిషన ల్ డీసీపీ మహమ్మద్ ఇక్బాల్ సిద్ధికి, అసిఫ్ నగర్, గోల్కొండ ఏసీపీలు విజయ్ శ్రీనివాస్, సయ్యద్ ఫయాజ్, హుమయున్ నగర్ ఇన్స్పెక్టర్ మల్లేష్ పాల్గొన్నారు.