15-05-2025 12:00:00 AM
ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ
ముషీరాబాద్, మే 14 (విజయక్రాంతి) : పేదల పక్షపాతి కాంగ్రెస్ ప్రభ్రుత్వం అని ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ అన్నారు. బుధవారం భోలక్ పూర్‌కు చెందిన మహ్మ ద్ షకీల్, అబ్దుల్ లతీఫ్, గులామ్ మోహినొద్దీన్, ఆబేద్ హుస్సేన్, మహ్మద్ అలీలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ... పేదలకు ప్రైవేటు ఆసుపత్రులలో మెరుగైన వైద్యం పొందేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో దోహద పడుతుం దని అన్నారు. పేదలకు సీఎం రేవంత్ రెడ్డి అండగా ఉంటూ వారి అవసరాలను తీర్చుతున్నాన్నారు. ఈ కార్యక్రమంలో భోలకప్పూర్ మాజీ కార్పొరేటర్ వాజీ ద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.