calender_icon.png 2 August, 2025 | 3:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీశైలం యాదవ్‌కు పితృవియోగం

15-05-2025 12:00:00 AM

ముషీరాబాద్, మే 14 (విజయక్రాంతి) : భోలక్ పూర్ గాంధీ నగర్‌కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శ్రీశైలం యాదవ్ తండ్రి సత్యనారాయణ (74) బుధవారం గుండె పోటుతో మృతి చెందా రు. ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం యశోధ ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరిశీలించి ఆయన చనిపోయారని ప్రకటించారు.

విషయం తెలు సుకున్న ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎం పీ అనిల్ కుమార్ యాదవ్, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు ఎమ్మెన్ శ్రీనివాస్ రావు, ముఠా జైసింహా, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ యాదవ్, కార్పొరేటర్ పావని వినయ్ కుమార్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు పూసరాజు, తెలంగాణ ఉధ్యమ నాయకుడు ప్రఫూల్ రాంరెడ్డి తదితరులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.

ఆయ న కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గట్లా సత్యనారాయణ దివంగత సీఎం టీ. అంజయ్య హయాంలో కాంగ్రెస్‌లో కీలక పాత్ర పోషించడంతో పాటు అంజయ్యకు అత్యంత సన్నిహితుడిగా ఉండేవాడని కుటుంబ సభ్యు లు తెలిపారు. ఆయన అంత్యక్రియలు బన్సీ లాల్ పేట్ శ్మశాన వాటికలో జరిగాయి.