21 August, 2026 | 2:22 AM

ఉపాధ్యాయుడి కుటుంబానికి లక్ష రూపాయలు అందజేత

21-08-2026 01:11 AM

మహబూబాబాద్, ఆగస్టు 20 (విజయక్రాంతి): మహబూబాబాద్ మైనారిటీ బాలుర గురుకుల పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న గణిత ఉపాధ్యాయుడు షేక్ గౌస్ మియా ఇటీవల రైలు ప్రమాదంలో మృతి చెందాడు. పీఆర్జీటిఏ రాష్ట్ర అధ్యక్షుడు వేమిరెడ్డి దిలీప్ కుమార్ రెడ్డి అధ్యక్షతన, రాష్ట్ర,జిల్లా కార్యవర్గ సభ్యులు వారి కుటుంబాన్ని పరామర్శించి, సంఘం తరపున వెల్ఫేర్ ఫండ్ నుండి లక్ష రూపాయల నగదు చెక్కును గౌస్ మియా సతీమణి సఫియా బేగంకు అందజేశారు.

ఈ కార్యక్రమంలోరాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి ఉప్పు అశోక్, రాష్ట్ర కోశాధికారి డాక్టర్ ఐ. నిర్మలానందం, టీజీఎమ్‌ఆర్‌ఈఐఎస్ రాష్ట్ర ప్రతినిధులు దిలీప్ రెడ్డి, లక్ష్మారెడ్డి, సంజీవరెడ్డి, వివిధ జిల్లాల ప్రతినిధులు స్టాన్లీ డెన్జిల్, వేణుగోపాల్, శివాజీ, వికాస్, సబావత్, వెంకటేష్, ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ఉపాధ్యాయ, అధ్యాపక బృందం.