18-05-2025 12:23:49 AM
- బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాంచందర్‌రావు వెల్లడి
హైదరాబా ద్, మే 17 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా ‘వన్ నేషన్ -వన్ ఎలక్షన్’ అవగాహన కార్యక్రమాలు కొనసాగు తున్నాయని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు తెలిపా రు. బీజేపీ రాష్ర్ట కార్యాలయం లో శనివారం మీడియా సమావేశం లో ఆయన మాట్లాడారు.. వన్ నేష న్ వన్ ఎలక్షన్‌పై రాష్ర్టవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 500 సమావే శాలు, గ్రూప్ మీటింగ్స్ నిర్వహించినట్లు తెలిపారు.
ఇందులో భాగంగా నే ఆదివారం సోమాజిగూడలోని హోటల్ కత్రియలో నిర్వహించనున్న ‘ప్రొఫెషనల్స్ ఫర్ వన్ నేషన్ వన్ ఎలక్షన్’ కార్యక్రమంలో కేంద్రమంత్రులు శివరాజ్‌సింగ్‌చౌహాన్, కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, వన్ నేషన్ -వన్ ఎలక్షన్ కార్యక్రమం జాతీయ ఇన్‌చార్జ్ అనిల్ ఆంటోనీ పాల్గొంటార ని పేర్కొన్నారు.