calender_icon.png 18 May, 2025 | 5:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కర్రెగుట్టల నుంచి తప్పించుకున్న 20 మంది మావోయిస్టుల అరెస్ట్

18-05-2025 12:11:46 AM

  1. భారీగా ఆయుధాలు స్వాధీనం 
  2. ములుగు పోలీసుల ఎదుట 8 మంది లొంగుబాటు

మహబూబాబాద్, మే 17 (విజయక్రాంతి): తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరి హద్దులో ఉన్న కర్రెగుట్టల్లో మావోయిస్టుల ఏరివేతకు నిర్వహించిన సర్చ్ ఆపరేషన్ నుం చి తప్పించుకొని చిన్నచిన్న బృందాలుగా ఏర్పడి ఇతర ప్రాంతాలకు వెళ్తున్న 20 మం ది మావోయిస్టులను ములుగు పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వారి నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు ములుగు ఎస్పీ శబరిష్ తెలిపారు.

గత రెండు రోజులుగా ములుగు జిల్లా పరిధిలోని వెంకటాపురం, వాజేడు, కన్నాయి గూ డెం పోలీస్ స్టేషన్ల పరిధిలో పాలెం ప్రాజెక్ట్, మురుమారు  ప్రాంతాల్లో వాహన తనిఖీలతో పాటు గుట్టల గంగారం, గుత్తి కోయగూడెంలో పెట్రోలింగ్ నిర్వహించగా 20 మంది మావోయిస్టులు పట్టుబడ్డారని ఎస్పీ తెలిపారు.

ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతాల్లో అనేక విధ్వంస కర సంఘటనలతో పాటు పోలీస్ ఇన్‌ఫార్మర్ల నెపంతో అనేక మందిని హత్య చేసిన ఘటనల్లో వీరు పాల్గొన్నారని ఎస్పీ తెలిపారు. వారి నుంచి 303, 8 ఎంఎం, ఎస్ ఎల్‌ఆర్‌కు చెందిన 12 రైఫిళ్లతో పాటు తూటాలను, మ్యాగ్జిన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

అలాగే రూ.58వేల నగదు, మావోయిస్టు సాహిత్యం, వాకి టాకీలు, రేడియోలు, చార్జబుల్ బ్యాటరీలు, పెన్‌డ్రైవ్‌లు, కిట్ బ్యాగులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. 8 మంది మా వోయిస్టులు లొంగిపోయినట్టు ఎస్పీ శబరీష్ తెలిపారు. వారికి ప్రభుత్వం అందిస్తున్న తక్షణ సాయం కింద ఒక్కొక్కరికి రూ.25 వేల చెక్కులను అందజేసినట్టు తెలిపారు.