18-05-2025 12:25:41 AM
-మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్, మే 17 (విజయక్రాంతి): దశాబ్దాలపాటు దగాపడ్డ తెలంగాణ ప్రజల ఆకాంక్షలే లక్ష్యంగా ప్రత్యేక రాష్ర్ట సాధనకు పునాది వేసి న తెలంగాణ సింహగర్జన సభకు సరి గ్గా 24 ఏండ్లు పూర్తిచేసుకుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. 2001, మే 17న కరీంనగర్‌లో నిర్వహించిన తెలంగాణ సింహగర్జనను గుర్తుతెచ్చుకుం టూ శనివారం ఎక్స్‌లో పోస్ట్‌పెట్టా రు.
తెలంగాణ నలువైపుల నుంచి లక్షలాదిగా తరలొచ్చిన జనప్రవాహంతో సభాప్రాంగణం సముద్రా న్ని తలపించిందని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ వచ్చేదా? సచ్చేదా? అం టూ ఎంతో మంది అడుగడుగునా అవమానించినా, అవహేళన చేసినా వెన్నుచూపని ధీరోదాత్తుడి సంక ల్పం.. ప్రపంచ ఉద్యమాల చరిత్రలో నే ఓ చెరగని సంతకమని చెప్పారు. ఆనాటి ప్రయాణం అనుకున్న గమ్యాన్ని ముద్దాడటమే ఒక చారిత్రక విజయమని కేటీఆర్ అన్నారు.