18-10-2025 03:31:26 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డిని శనివారం డీజీపీ కార్యాలయంలో భాజపా సీనియర్ నాయకులు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ అరిగెల నాగేశ్వరావు మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. గతంలో బెల్లంపల్లి అడిషనల్ ఎస్పీగా పనిచేసిన సమయంలో ఇద్దరి మధ్య స్నేహ సంబంధం,అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. జిల్లాలో నెలకొన్న శాంతి భద్రతల సమస్యలను దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన వెంట ప్రముఖ పారిశ్రామికవేత్త నక్క ఉమేష్ యాదవ్ ఉన్నారు.