18-10-2025 03:34:58 PM
రోడ్డుపై బైఠాయించి బీసీ బందుకు మద్దతు తెలిపిన అఖిలపక్ష నాయకులు
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ తో శనివారం తలపెట్టిన బీసీ బందు ప్రశాంతంగా ముగిసింది.అఖిలపక్షం ఆధ్వర్యంలో మండలంలోని అన్ని పాఠశాలలను బంద్ చేయించారు. దుకాణాలను,ప్రభుత్వ కార్యాలయాలను స్వచ్చందంగా బంద్ పాటించాలని కోరారు. అనంతరం మండల కేంద్రం అర్వపల్లిలోని సూర్యాపేట-జనగాం 365(బీ)జాతీయ రహదారిపై బైఠాయించి బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చి,బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీంతో జాతీయ రహదారిపై ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సీఐ నాగేశ్వర్ రావు ఆధ్వర్యంలో ఎస్సై ఈట సైదులు తన సిబ్బందితో వచ్చి శాంతిభద్రతలకు ఆటంకం కలుగకూడదని అఖిలపక్ష నాయకుల నిరసనను విరమింప చేశారు.