23-01-2026 12:00:00 AM
చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మేకల మహేందర్
వెంకటాపూర్, జనవరి22,(విజయక్రాంతి): ప్రతి ఒక్కరు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మేకల మహేందర్, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బానోత్ స్వా మి దాస్ పేర్కొన్నారు. గురువారం జాతీయ, రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థల ఆదేశాలను అనుసరించి, ములుగు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ అధ్యర్యంలో ‘చైల్ మ్యా రేజ్ ఫ్రీ భారత్‘ ప్రచారంలో భాగంగా మం డలంలోని పాలంపేట గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో న్యాయవిజ్ఞాన సద స్సు నిర్వహించగా, ఈ కార్యక్రమానికి ము ఖ్యఅతిధిగా చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌ న్సిల్ మేకల మహేందర్, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బానోత్ స్వా మి దాస్ పాల్గొని మాట్లాడారు.. బాల్య వివా హ నిషేధిత చట్టం, పోక్సో చట్టం, విద్య హక్కు చట్టం, ర్యాగింగ్ చట్టం, మోటార్ వెహికల్ చట్టం గురించి వివరించారు. అలా గే బాల్య వివాహం చేస్తే నేరమని, ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగిన సమాచారం ఇ వ్వాలని, అదేవిధంగా ఉచిత న్యాయ సహాయానికి టోల్ ఫ్రీ నెంబర్ 15100 కి కాల్ చే యాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్, ఉపాధ్యా యులు అనిత, రవి, కిరణ్, విద్యార్థులు పాల్గొన్నారు.