calender_icon.png 5 August, 2025 | 2:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇల్లందులో నిషేధిత గంజాయి పట్టివేత

04-08-2025 11:24:55 PM

ఇల్లందు (విజయక్రాంతి): ఇల్లందు డీఎస్పీ ఆదేశాల మేరకు మండల పరిధిలోని బొజ్జాయిగూడెం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సబ్ ఇన్స్పెక్టర్ పి.శ్రీనివాస్ రెడ్డి(Sub Inspector Srinivas Reddy) తన సిబ్బందితో  సోమవారం వాహనాల తనిఖీ చేస్తుండగా కొత్తగూడెం నుండి ఇల్లందు వైపు వస్తున్న కారులో ముగ్గురు నిందితుల వద్ద  45.256 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ, స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ దాదాపు రూ.22,62,800 విలువ ఉంటుందని తెలిపారు. నిందితుల వద్ద మూడు మొబైల్ ఫోన్లు, వాహనాన్ని స్వాధీనం చేసుకొని, నిందితులపై కేసు నమోదు చేసుకొని రిమాండ్ కి తరలించామన్నారు.