04-08-2025 11:26:32 PM
ఘట్ కేసర్ : ఆర్థిక ఇబ్బందులతో ఆటో డ్రైవర్ రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఘట్కేసర్ రైల్వే స్టేషన్(Ghatkesar Railway Station) పరిధిలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సోమవారం యంనంపేట రైల్వే బ్రిడ్జి క్రింద జగద్గిరిగుట్టకు చెందిన మల్లికార్జున్ అనే వ్యక్తి రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. మల్లికార్జున్ ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తున్నట్లు ఇతనికి భార్య, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మల్లికార్జున్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. సంఘటన స్థలాన్ని చేరుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించినట్లు తెలిపారు.