04-08-2025 11:14:12 PM
ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లకు ఎంతోమంది బలయ్యారు..
మీకోసం కార్యక్రమం..
సిరిసిల్ల రూరల్ సిఐ మొగిలి..
ఇల్లంతకుంట (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District) ఎస్పీ మహేష్ బాబా సాహెబ్ గీతే ఆదేశాల మేరకు ఇల్లంతకుంట జవారిపేట గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఇందులో భాగంగా యువత ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లతో ఆన్లైన్ గేమింగ్ యాప్లతో చాలా జాగ్రత్తగా ఉండాలని సిరిసిల్ల రూరల్ సిఐ మొగిలి అన్నారు. ఇల్లంతకుంట మండలం జవారిపేట గ్రామంలో ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్ ఆధ్వర్యంలో మీకోసం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిఐ కె మొగిలి అనంతరం ఆయన మాట్లాడుతూ, యువత ఎక్కువ శాతం ఆన్లైన్ బెట్టింగ్లతో తమ అమూల్యమైన జీవితాలను నాశనం చేసుకుంటున్నాయని అప్పులు చేసి బెట్టింగ్ యాప్ లో పెట్టి ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకొని చివరకు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు చాలా వింటున్నామన్నారు.
అదేవిధంగా ఆన్లైన్ గేమ్ ద్వారా యువత చాలా డబ్బులు నష్టపోతున్నారని వీటితో యువతకు చాలా ప్రమాదం ఉందని వీటికి దూరం ఉండాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. తల్లిదండ్రులు యొక్క పిల్లలను ఇలాంటి ఆన్లైన్ బెట్టింగ్ ఆన్లైన్ గేమ్లు ఆడకుండా చూడాలని సిఐ సూచించారు. గ్రామంలో ఆన్లైన్ బెట్టింగ్ ఆన్లైన్ గేమింగ్ లు ఎక్కువగా ఆడుతున్నట్టుగా తమ దృష్టికి వచ్చిందని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత మంచి మార్గాన్ని ఎంచుకొని బంగారు భవిష్యత్తు ఉండే విధంగా కార్యచరణ రూపొందించుకోవాలని కోరారు. ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో జాబులను సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సిఐ సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.