01-12-2024 12:13:23 AM
సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్
సింధు, భారత బ్యాడ్మింటన్ ప్లేయర్
లక్నో: సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ సింధు ఫైనల్‌కు చేరుకుంది. శనివారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో 21-12, 219 తేడాతో భారత్‌కే చెందిన ఉన్నతి హుడా మీద సునాయస విజయం సాధించింది. 17 ఏండ్ల హుడాను సిం ధు కేవలం 36 నిమిషాల్లోనే మట్టికరిపించింది. హు డా చాలా ఇబ్బంది పడింది. అనవసర తప్పిదాలతో గేమ్‌ను కోల్పోయింది.
టీనేజర్ ఉన్నతి హు డా మీద సింధు పూర్తి ఆధిపత్యం చెలాయించింది. సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టోర్నీ లో సింధు ఇది వరకే రెండు సార్లు టైటిల్ సా ధించింది. ప్రస్తుతం తన మూడో టైటిల్ కోసం అడుగు దూరంలో నిలిచింది. సింధు ఫైనల్ పోరు లో చైనా క్రీడాకారిణి లువోయుతో తలపడనుంది.
మిక్స్‌డ్ డబుల్స్‌లో..
భారత మిక్స్‌డ్ డబుల్స్ జోడీ తనీషా-
ధ్రువ్ కూడా ఫైనల్ చేరుకున్నారు. సెమీస్‌లో ఈ జోడీ 21-16, 21-15 తేడాతో జిహాంగ్ జూ యాంగ్ జియా (చైనా) మీద సునాయస విజయం సాధించారు. ఈ మ్యాచ్ కేవలం 42 నిమిషాల్లోనే పూర్తవడం గమనార్హం.
తప్పని లక్ష్యం
పురుషుల సింగిల్స్ ఆటగాడు లక్ష్యసేన్ కూడా ఫైనల్‌కు దూసుకెళ్లాడు. సెమీఫైనల్ మ్యాచ్‌లో 21-8, 21-14 తేడాతో ఒగావా (జపాన్) మీద అలవోకగా విజయం సాధించాడు. మొదటి గేమ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి రెండో గేమ్‌లో కాస్త పోటీ ఇచ్చాడు. ఈ పోరు 42 నిమిషాల పాటు జరిగింది. లక్ష్యసేన్ ఫైనల్ పోరులో సింగపూర్‌కి చెందిన జాసన్‌తో తలపడనున్నాడు.