01-12-2024 12:00:00 AM
వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్
సింగపూర్: లింగ్ డిరెన్‌తో జరిగిన ఐదో గేమ్‌ను కూడా గుకేశ్ డ్రాగా ముగించాడు. ఐదు గేమ్‌లు ముగిసే సరికి గుకేశ్, లిరెన్ చెరి 2.5 పాయింట్లతో కొనసాగుతున్నారు. విజేతగా నిలిచేందుకు ఇంకా 5 పాయింట్లు కావాలి.
మొదట ఎవరు 7.5 పాయింట్లు సాధిస్తారో వారినే విజేతగా ప్రకటిస్తారు. 40 ఎత్తుల్లో మ్యాచ్‌ను డ్రాకు అంగీకరించారు. ఐదు గేమ్స్ జరగ్గా.. ఇది మూడో డ్రా.